10th Exams: పది పరీక్షల్లో విద్యార్ధులకు 24 పేజీల బుక్ లెట్! 22 d ago
ఇక నుంచి పదో తరగతి పరీక్షల్లో విద్యార్ధులకు జవాబు పత్రాలకు దారం కట్టే తిప్పలు తప్పాయి. ఇంటర్ పరీక్షల తరహాలోనే విద్యార్దులకు 24 పేజీల బుక్‌లెట్ ఇవ్వనున్నారని ఎస్ఎస్‌సీ బోర్డు సంచాలకుడు ఎ. కృష్ణారావు ఆదేశాలు జారీ చేశారు. ఇటీవలే పరీక్షల ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించేలా ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం తాజాగా పది పరీక్షల్లో 5 సబ్జెక్టులకు 24 పేజీలు, భౌతిక, జీవశాస్త్రాలకు 12 పేజీల బుక్‌లెట్‌లు సరఫరా చేసేందుకు అనుమతినిచ్చింది.